రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారాయి

ABN , First Publish Date - 2020-08-16T11:19:48+05:30 IST

రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారాయని, దళితుల పట్ల ఈ ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపించారు.

రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారాయి

దళితుల పట్ల వివక్ష ధోరణి


కడప, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారాయని, దళితుల పట్ల ఈ ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపించారు. శనివారం ఆర్టీసీ బస్టాండు వద్ద గల అంబేడ్కర్‌ సర్కిల్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా దళితులపై దాడులకు పాల్పడుతూ, అవమానాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబునాయుడు హయాంలో ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కోసం 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది 4700 కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు.


పెళ్లి కానుకకు రూ.లక్ష అని ప్రకటించి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నామినేటెడ్‌ పదవుల్లో మీ సామాజికవర్గానికి పెట్టపీట వేయడం దళితులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో కడప నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌, నాయకులు పీరయ్య, ఈశ్వరయ్య, బిట్టా శ్రీధర్‌, జిలానీబాష, జయచంద్ర, గుర్రప్ప, కొమ్మలపాటి, జాకీర్‌, జయశేఖర్‌, రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-16T11:19:48+05:30 IST