రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం హర్షణీయం

ABN , First Publish Date - 2020-03-19T10:39:06+05:30 IST

కరోనా వైరస్‌ వల్ల ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం హర్షణీయం

టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి 


కడప (చిన్నచౌకు), మార్చి 18: కరోనా వైరస్‌ వల్ల ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం హర్షణీయమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రజారోగ్యం కంటే తన గెలుపు అహంకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.


సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూసి పారాసిటమాల్‌ ఎవరు వేసుకోవాలో జగన్‌ చెప్పాలన్నారు. సుప్రీంకోర్టు ఎన్నికల కోడ్‌ను సడలించడాన్ని కూడా స్వాగతిస్తున్నామన్నారు. ఎస్‌ఈసీ ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అని, దానికి జ్యుడీషియల్‌ పవర్స్‌ ఉన్నాయన్నారు. హైకోర్టు జడ్జి హోదా ఉందని, అలాంటి రమే్‌షకుమార్‌ని కులం పేరుతో దూషించడం తగదన్నా రు. సుప్రీంకోర్టు జడ్జిలకు కులం ఆపాదిస్తారేమోనని భయంగా ఉందన్నారు. విదేశాల్లో ఆంధ్రులు విమానాశ్రయాల్లో విలపిస్తుంటే ఏపీ ప్రభుత్వం నిద్రపోతోందన్నారు. కనీసం ఏపీ భవన్‌ నుం చి కూడా సమన్వయం చేయలేకపోతున్నారన్నారు. కరోనాపై జగన్‌ వ్యాఖ్యలు చూసి ప్రపంచమంతా నవ్వుతోందన్నారు. దేశమంతా అలర్ట్‌ అయినా సీఎం మాత్రం మొద్దు నిద్ర లేవడం లేదన్నారు.


జగన్‌ ఇగో రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. అన్ని రాష్ట్రాలు కరోనా పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఇప్పటి వరకు ప్రకటించలేద న్నారు. ఈ రాష్ట్రంలో అసలు ఆరోగ్యశాఖ మంత్రి ఉన్నారా? అని ప్రజలకు అనుమానం వస్తోందన్నారు. ఇప్పటికైనా జగన్‌ తన అధికార దాహాన్ని వీడి ప్రజల ప్రాణాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. గతంలో పులివెందులలో మాత్రం దాడులు జరిగేవి, ఇప్పుడు రాష్ట్రమంతా అరాచకాలు చేస్తున్నారన్నారు. కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించడం బాధాకరమన్నారు. జగనన్నకి గిఫ్ట్‌ ఇస్తామని సీఐ స్థాయి అధికారులు బహిరంగంగా ప్రకటించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి రీషెడ్యూలు విడుదల చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరతామన్నారు. 

Updated Date - 2020-03-19T10:39:06+05:30 IST