పాత్రికేయుల సేవలు కీలకం
ABN , First Publish Date - 2020-08-01T11:49:19+05:30 IST
కొవిడ్ -19పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో పాత్రికేయుల సేవలు కీలకమని కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. శుక్రవారం స్థానిక

కడప(కలెక్టరేట్) జూలై 31: కొవిడ్ -19పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో పాత్రికేయుల సేవలు కీలకమని కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో అక్రిడిటేషన్ కార్డులు కల్గిన పాత్రికేయులకు రూ.2 వేలు విలువ గల నిత్యవసర వస్తువులను కలెక్టర్ పంపిణీ చేశారు. సమాచార శాఖ ఏడీ వేణు గోపాల రెడ్డి, డివిజనల్ పీర్వోలు పురుషోత్తం, ఏపీఆర్వోలు ప్రభాకర్, పాత్రికేయులు పాల్గొన్నారు.