సింహాద్రిపురంలో రెండో కేసు నమోదు

ABN , First Publish Date - 2020-06-22T11:30:35+05:30 IST

సింహాద్రిపురంలో కరోనా రెండో పాజిటీవ్‌ కేసు నమోదైనట్లుగా ఆదివారం పీహెచ్‌సీ డాక్టర్‌ ఖాజామోదీన్‌ అధికారికంగా ప్రకటించారు.

సింహాద్రిపురంలో రెండో కేసు నమోదు

సింహాద్రిపురం, జూన్‌ 21: సింహాద్రిపురంలో కరోనా రెండో పాజిటీవ్‌ కేసు నమోదైనట్లుగా ఆదివారం  పీహెచ్‌సీ డాక్టర్‌ ఖాజామోదీన్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ వ్యక్తికి వారం రోజుల కిందట స్వాబ్‌ పరీక్షలు నిర్వహించి ల్యాబ్‌కు పంపగా ఆదివారం పాజిటీవ్‌గా నిర్ధారణ అయినట్లు డాక్టర్‌ తెలిపారు.  ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి ఆ ప్రాంతాన్ని కంటైన్‌ మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. కాగా కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించిన బలపనూరు ఎస్సీ కాలనీని ఆదివారం మండల అధికారులు డీటీ శ్రీరంగనాథ్‌, డాక్టర్‌ ఆస్మా,  ఆర్‌ఐ సుజిత్‌, ఎస్‌ఐలు పర్యవేక్షించారు. కాలనీలో పాజిటీవ్‌ వచ్చిన వ్యక్తికి సంబందించిన 40 మందికి కరోనా స్వాబ్‌ పరీక్షల కోసం వారిని 15 రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో వుంచారు. అదే కాలనీలో ఎల్లయ్యగారి శంకర్‌ (52) అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆ వ్యక్తి ఇతర వ్యాదులతో మృతి చెందాడా లేక కరోనా ఏమైనా సోకిందా అనే అనుమానంతో మృతని వద్ద కోవరంగుట్టపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారిణి ఆస్మా  కరోనా పరీక్షలకు స్వాబ్‌ నమూనాలు సేకరించారు. 

Updated Date - 2020-06-22T11:30:35+05:30 IST