ఎన్నికల్లో జోనల్‌ అధికారుల పాత్ర కీలకం : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-03-13T10:35:49+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో జోనల్‌ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్‌ హరికిరణ్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని స్పందన

ఎన్నికల్లో జోనల్‌ అధికారుల పాత్ర కీలకం : కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌), మార్చి 12: స్థానిక సంస్థల ఎన్నికల్లో జోనల్‌ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్‌ హరికిరణ్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని స్పందన హాలులో గురువారం 2020 స్థానిక సంస్థల ఎన్నికలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ఎన్నికల పక్రియపై జోనల్‌ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికలపై అందరికీ శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని.. ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు.


పోలింగ్‌ రోజు బ్యాలెట్‌ బాక్సులు పోలింగ్‌కు 15 నిమిషాల ముందు సిద్ధంగా ఉండాలన్నారు. బ్యాలెట్‌ బాక్సులు ఎలా ఓపెన్‌, క్లోజ్‌ ఎలా చేయాలనేవిషయాలపై తెలుసుకోవాలన్నారు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ ఉంటుందన్నారు. వంద మీటర్ల లోపు ఓటర్లు తప్ప మిగతా వారు ఉండరాదన్నారు. పోలింగ్‌ రోజు ఎలాం టి ప్రచారాలు చేయరాదన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో కరెంట్‌, ఫర్నీచర్‌ తదిర మౌలిక వసతులు ఏర్పాటుపై జోనల్‌ అధికారులు విజిట్‌ చేసి ఎంపీడీవోకు తెలపాలన్నారు. గ్రామ పం చాయతీ ఎన్నికలు మధ్యాహ్యం 1 గంటకే పూర్తి అవుతాయని.. వెంటనే కౌంటింగ్‌ పక్రి య, ఫలితాలు వెల్లడించడం జరుగుతుందన్నారు. అనంతరం సాధారణ ఎన్నికల పరిశీలకులు పి.రంజిత్‌ బాషా మాట్లాడుతూ జిల్లాలో స్థాని క సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈనెల 29వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందన్నారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అనుసరించి పని చేయాలన్నారు.


ఎక్క డైనా సమస్యలు ఉంటే జిల్లా కేంద్రంలో కంట్రో ల్‌రూం ఫోన్‌ నెంబరు 08562-246344 కు తెలపాలన్నారు. ప్రతి మండలంలో రెండు ఫ్లయింగ్‌ టీమ్‌లు తిరుగుతుంటాయన్నారు. ప్రతి విషయాన్ని వీడియోగ్రఫీ తీస్తారని, రిపోర్టులు ప్రతి రోజు పంపాలన్నారు. ఎక్కడా మద్యం, లిక్కరు, డబ్బు పంపిణీ జరగకూడదన్నారు. రూ.50వేలకు మించి ఉంటే చర్యలు తప్పవన్నా రు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌-2 శివారెడ్డి,  సీపీవో తిప్పేస్వామి, ఏపీ ఎం ఐపి పీడీ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T10:35:49+05:30 IST