పెట్టుబడి జాస్తి - దిగుబడి నాస్తి

ABN , First Publish Date - 2020-12-28T05:18:42+05:30 IST

ఎంతో ఖర్చు చేసి పంటను సాగు చేస్తే దిగుబడి మరీ తక్కువగా వచ్చింది. ఖరీఫ్‌, రబీలో పెసర, మినుము పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

పెట్టుబడి జాస్తి - దిగుబడి నాస్తి
కాయ, పిందె తక్కువగా ఉన్న మినుము పంట

ఇదీ పెసర, మినుము రైతుల పరిస్థితి


కమలాపురం, డిసెంబరు 27: ఎంతో ఖర్చు చేసి పంటను సాగు చేస్తే దిగుబడి మరీ తక్కువగా వచ్చింది. ఖరీఫ్‌, రబీలో పెసర, మినుము పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంటలు చేతికొచ్చే సమ యంలో తుపాను కారణంగా అవి పూర్తిగా దెబ్బతినడంతో సాగు చేసిన రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చుల్లో ఒక భాగం కూడా అంద డంలేదు. ఖరీఫ్‌ చివరి రోజుల్లో పెసర, మిను ము సాగు చేసిన రైతులు ప్రస్తుతం ఆపంటను కోసి నూర్పిళ్లు చేస్తున్నారు. మండలంలో పెసర వంద హెక్టార్లలో సాగు చేయగా, మినుము 600 హెక్టార్లకుపైగా సాగైంది. రైతులు ప్రస్తు తం  పంట కోసేందుకు ఎకరాకు రూ.4 వేలు దాకా ఖర్చు చేయగా నూర్పిడి మిషన్‌ ద్వారా రూ.1500 ఖర్చు అవుతోంది. పెట్టుబడిగా విత్తు లు, సత్తువలు, మందులు, కలుపు మొక్కలు తదితర వాటికి ఎకరాకు రూ.10 నుంచి రూ.15 వేలు ఖర్చు చేశారు. మొత్తంమీద ఎకరాకు రూ.15 నుంచి రూ.20 వేలు ఖర్చు అయింది. బాగా పండితే ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం ఎకరాకు క్వింటా కూడా రావ డంలేదు. దీంతో  ఈ ఏడాది పెసర, మినుము పంట రైతులకు తీవ్ర నష్టాన్నే మిగిల్చి అప్పులపాలు చేసిందని చెప్పవచ్చు. 


ఖర్చులు కూడా రాలేదు

పచ్చపెసర పంట ఎకరన్నర సాగు చేశా. విత్తనం, సత్తువలు, సేద్యపు ఖర్చు మందు పిచికారికి రూ.10వేలు పైగానే అయ్యాయి. ప్రస్తుతం పంటకోతకు కూలీలకు రూ.6 వేలు అయింది. నూర్పిడికి గంటకు రూ.1500లతో మిషన్‌ మాట్లా డుకున్నా. ఎక రన్నరకు రూ.8 వేలు ఖర్చు అయింది. దిగుబడి చూస్తే ఒకటిన్నర క్వింటా కూడా కాలేదు.  

-వెంకటలక్షుమ్మ, యల్లారెడ్డిపల్లె

Updated Date - 2020-12-28T05:18:42+05:30 IST