వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-04T10:18:25+05:30 IST

మండలంలోని ఎర్రమాచుపల్లెకు చెందిన చెండ్రాయుడు (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు సీకేదిన్నె ఎస్‌ఐ రాజరాజేశ్వరరెడ్డి

వ్యక్తి ఆత్మహత్య

సీకేదిన్నె, మార్చి 3: మండలంలోని ఎర్రమాచుపల్లెకు చెందిన చెండ్రాయుడు (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు సీకేదిన్నె ఎస్‌ఐ రాజరాజేశ్వరరెడ్డి తెలిపారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే చెండ్రాయుడు భార్య మూడునెలల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోగా ఇద్దరు పిల్లలను పోషించలేక అత్తవారింటిలో వదిలేసి మతిస్థిమితం లేక తిరుగుతుండేవాడు.


ఇతను సోమవారం రాత్రి  ఇంటికి వచ్చి పడుకున్నాడు. మరుసటి రోజు మధ్యాహ్నం అవుతున్నా బయటికి రాకపోవ డంతో స్థానికులు వాకిలి పగల గొట్టి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-03-04T10:18:25+05:30 IST