వడ్డీ భారం తగ్గించడమే లక్ష్యం : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-04-25T08:49:08+05:30 IST
స్వయం సహాయక సంఘాల ద్వారా డ్వా క్రా మహిళ లు తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీ భారం తగ్గించేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి

ప్రొద్దుటూరు క్రైం, ఏప్రిల్ 24 : స్వయం సహాయక సంఘాల ద్వారా డ్వా క్రా మహిళ లు తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీ భారం తగ్గించేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సున్నా వడ్డీ పథకం ప్రారంభించారని స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పురపాలక సంఘ సమావేశ భవనంలో పురపాలికకు సంబంధించి 1580 స్వయం సహాయక సంఘాలకు రూ.2కోట్ల 81లక్షల 71వేల 461ల చెక్కును ఆయన అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధ, మెప్మా అధికారిణి కేజియా జాస్మిన్ పాల్గొన్నారు.
జమ్మలమడుగు రూరల్ పరిధిలో: నగర పంచాయతీ మెప్మా కార్యాలయంలో సున్నా వడ్డీ చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి డ్వాక్రా సంఘాలకు అందజేశారు. నగర పంచాయతీ పరిధిలో 6,549 మందికి రూ.1,21,66,876 వారి ఖాతాల్లో జమ అవుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీవో వెంకటసుబ్బయ్య, మె ప్మా అధికారులు గంగులయ్య, సీవో నాగలక్ష్మి, వైసీపీ నేతలు పాల్గొన్నారు.
ఎర్రగుంట్లలో: డ్వాక్రా మహిళల రుణాలకు సంబందించి నగరపం చాయతీ కార్యాలయంలో కమిషనర్ రంగస్వామి, మెప్మా టీఎంసీ దీప్తి అనితతో కలిసి చెక్కులను పంపిణీచేశారు. పట్టణంలోని 493గ్రూపుల కు సంబందించి రూ.1.24,86,874 మంజూరు అయ్యింది.