ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-29T05:14:40+05:30 IST

ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యం
ముద్దనూరులో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ముద్దనూరు డిసెంబరు28: ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. స్థానిక శివాలయం సమీపంలో సోమవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  మండలంలో 854 మందికి పట్టాలు పంపిణీ కార్యక్రమంలో చేపట్టడం జరిగిందని, అందులో మండల కేంద్రంలో 464 పట్టాలు పంపిణీ చేయగా 376 మందికి పక్కా ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ముందుగా పక్కా ఇంటికి భూ మి పూజ చేసి లబ్ధిదారులకు  పట్టాలు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మునిరాజారెడ్డి, ఎస్‌వీఆర్‌ ట్రాన్స్‌పోర్టు అధినేత వరదారెడ్డి, గురుట్రాన్స్‌పోర్టు అధినేత గుర్రప్ప, వైసీపీ మండల కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి, సుమంత్‌యాదవ్‌, ఆర్డీవో నాగన్న,  తహసీల్దారు దైవరాజన్‌, వైసీపీ నేతలు  పాల్గొన్నారు.

ప్రొద్దుటూరులో..

ప్రొద్దుటూరు అర్బన్‌, డిసెంబరు 28: వైసీపీ ప్రభుత్వంలోనే పేదలకు సొంతింటికల నెరవేరబోతున్నదని ఎమ్మెల్యే రాచ మ ల్లు ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం బొల్లవరం రెవిన్యూ పొలంలో పేదలకు మంజూరైన ఇంటిపట్టాలను లబ్ధిదారులకు   పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌, కమిషనర్‌  రాధ, ఎంపీడీవో సుబ్రమణ్యం, టీటీడీ మెంబర్‌ చిప్పగిరి ప్రసాద్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గురివిరెడ్డి, మాజీ కౌన్సిల్లర్లు సునంద, రామాంజనేయరెడ్డి, వైసీపీ నేతలు వరికూటిఓబులరెడ్డి,పోరెడ్డినరసింహారెడ్డి,  బంగారుమునిరెడ్డి, శేఖర్‌యాదవ్‌, కామిసెట్టి బాబు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 28: నగర పంచాయతీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమ వారం  పట్టణంలోని బీసీ కాలనీలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే, వైసీపీ నాయకులతో కలిసి  ఇంటింటికి వెళ్లి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 25వ తేదీ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో బీసీ కాలనీలో ఇంటి పట్టాలు రానివారు లారీని అడ్డుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ  సంక్షేమ పథకాలు అందుతున్నా యా? లేదా? అని  అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నగర పంచాయతీ కమిషనర్‌ వెంకటరామిరెడ్డి, వైసీపీ నా యకులు దొడియం విష్ణువర్ధన్‌రెడ్డి, కేశం రామిరెడ్డి, మార్బుల్‌ శ్రీను, పట్టణాధ్యక్షులు పోరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, హౌసింగ్‌ అధికారులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:14:40+05:30 IST