రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేశారు

ABN , First Publish Date - 2020-03-18T05:49:51+05:30 IST

రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేశారు

రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేశారు

బీజేపీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి


సంబేపల్లె, మార్చి 17:  స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు, అధికారులు రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేశారని బీజేపీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఏవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడు తూ సంబేపల్లె మండలం నారాయణరెడ్డిపల్లె గ్రామం ఎంపీటీసీ బీజేపీ అభ్యర్థిగా రేపన చంద్రమ్మ  నామినేషన్‌ దాఖలు చేశారని..ఈ నెల 14న నామినేషన్ల ఉపసంహరణలో అధికారులు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అభ్యర్థి రాకుండానే విత్‌డ్రా చేయించి వైసీపీ అభ్యర్థిని ఏకగ్రీవం చేయడం రాజ్యాంగ వ్యవస్థనే నిర్వీర్యం చేసినట్లు ఉందన్నారు. తిరిగి నారా యణరెడ్డిపల్లె ఎంపీటీసీ ఎన్నికలు జరిగేలా కోర్టుకెళ్తామని తెలియజేశారు.


వైసీపీ దౌర్జన్యాలపై కేంద్రం దృష్టికి తీసుకెళతామన్నా రు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే అధికారులకు శిక్ష తప్పదని ఇటీవల ఎన్నికల కమిషన్‌ తీసుకున్న చర్యలే ఇందు కు నిదర్శమన్నారు. అనంతరం ఎంపీడీవో నరసింహులుకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శివగంగిరెడ్డి, రాయచోటి అసెంబ్లీ కన్వీనర్‌ శ్రీనివాసరాజు, పట్టణ అద్యక్షుడు బాలాజీ, బీజేపీ నాయకులు శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-18T05:49:51+05:30 IST