నామినేషన్ల స్వీకరణ తీరు సరిలేదు

ABN , First Publish Date - 2020-03-12T07:26:22+05:30 IST

ప్రొద్దుటూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం సక్రమంగా

నామినేషన్ల స్వీకరణ తీరు సరిలేదు

అధికారుల నిర్వహణపై అసంతృప్తి 

ఆర్వో గదిలోకి గుంపులుగా అనుమంతించడంపై ఆగ్రహం


ప్రొద్దుటూరు, మార్చి 11: ప్రొద్దుటూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం సక్రమంగా నిర్వహించడంలేదంటూ పరిశీలకులు సతీ్‌షచంద్ర అసహనం వ్యక్తం చేశా రు. చివరిరోజు అయిన బుధవారం ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తుంటారని, ఒకే అధికారి స్వీకరించడం సాధ్యపడదన్నారు. ఏఆర్వో మరికొన్ని స్వీకరిస్తే కొంతవరకు బాగుండేదని అభిప్రాయపడ్డారు. అభ్యర్థులిచ్చిన నామినేషన్‌ పత్రాలను పూర్తిస్థాయిలో ఆర్వోనే పరిశీలించే పద్ధతి ఏం బాగోలేదని.. మరికొంతమంది సిబ్బంది సహకారం తీసుకోకుండా ఇలా చేయడం వలన ఒక్కసారిగా దరఖాస్తుదారులు వస్తే ఏం  చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. ఏఆర్వో ప్రస్తుతం ఏం చేస్తున్నారని ఆరా తీశారు.


ఓటర్ల జాబితాలో పేర్లను చూస్తున్నానని ఏఆర్వో సుబ్రహ్మణ్యం సమాధానమిచ్చారు. గది నిండా అధిక సంఖ్యలో జనాలను ఉంచడంపై కొంతమేర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో అభ్యర్థికి సంబంధించి ముగ్గురు మాత్రమే ఆర్వో వద్దకు రావాలని ఆ అభ్యర్థి బయటికి వెళ్లిన తర్వాతనే మరో అభ్యర్థి లోపలికి తీసుకోవాల్సి ఉంటే నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అధిక సంఖ్యలో జనాలను రూములో ఎందుకు ఉంచుకుంటున్నారంటూ ఆర్వోను ప్రశ్నించారు. మీడియాకు సంబందించి ఒక్కొక్కరుగా వచ్చి ఫోటోలు తీసుకోవాలంటూ సూచించారు. అనంతరం బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్‌ఐ కృష్ణయ్య ఆర్వో గదిలోని జనాలను బయటకు పంపించారు. 

Updated Date - 2020-03-12T07:26:22+05:30 IST