పులివెందులలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

ABN , First Publish Date - 2020-08-01T11:48:04+05:30 IST

పులివెందులలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

పులివెందులలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

తాడేపల్లిలో సీఎం జగన్‌ రివ్యూ


పులివెందుల, జూలై 31: పులివెందులలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలో పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా)పై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పులివెందుల అభివృద్ధిపై సమీక్షించారు. అందులో జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ స్కీం, అలవలపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం పనుల పురోగతిపై చర్చించారు.


చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 10టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయడం కోసం రూ.261.90కోట్ల నిధులు విడుదలకు పరిపాలన అనుమతులపై చర్చించారు. ఏపీకార్ల్‌ భూముల వినియోగంపై, పులివెందులలో క్రికెట్‌ స్టేడియం, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై సమావేశంలో చర్చించారు. గండికోట రిజర్వాయర్‌ నుంచి 40 రోజుల్లో పార్నపల్లె మరియు పైడిపాళెం డ్యామ్‌లకు నీటి సరఫరా చేసే ప్రాజెక్టులకు పరిపాలన ఆమోదం తెలిపారు. పెండింగ్‌ ప్రాజక్టులు పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

Updated Date - 2020-08-01T11:48:04+05:30 IST