నేడు తెప్పోత్సవం

ABN , First Publish Date - 2020-11-16T04:40:28+05:30 IST

మండల కేంద్రమైన పెనగలూరు కన్యకల చెరువులో సోమవారం సాయంత్రం తెప్పోత్సవం నిర్వహిస్తున్న గ్రామ పురోహితుడు పి.సి.సుబ్బనరసయ్య తెలిపారు.

నేడు తెప్పోత్సవం

పెనగలూరు, నవంబరు15 : మండల కేంద్రమైన పెనగలూరు కన్యకల చెరువులో సోమవారం సాయంత్రం తెప్పోత్సవం నిర్వహిస్తున్న గ్రామ పురోహితుడు పి.సి.సుబ్బనరసయ్య తెలిపారు. జూన్‌లో జరగాల్సిన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు  కరోనా వైరస్‌ కారణంగా నామమాత్రంగా జరగడం వల్ల ఈ తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. తెప్పపై రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలుడు, కామాక్షి సమేత నయనాధీశ్వరుల ఉత్సవ మూర్తులతో నీళ్లపై విహారయాత్ర జరుగుతుందన్నారు.

Updated Date - 2020-11-16T04:40:28+05:30 IST