ఇంటిపై దాడి చేసి మళ్లీ కేసులు పెడతారా?

ABN , First Publish Date - 2020-12-28T05:05:58+05:30 IST

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి న వారిపై కేసులు పెట్టకుం డా, ఆయన కుటుంబంపైనే కేసులు ఎలా పెడతారం టూ టీడీపీ రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

ఇంటిపై దాడి చేసి మళ్లీ కేసులు పెడతారా?
జేసీ ప్రభాకర్‌రెడ్డితో మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి

రాష్ట్రంలో ఆటవిక పాలన జేసీ ప్రభాకర్‌రెడ్డికి పరామర్శ

 టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి

కడప, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై  దాడి చేసి న వారిపై కేసులు పెట్టకుం డా, ఆయన కుటుంబంపైనే కేసులు ఎలా పెడతారం టూ టీడీపీ రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆయన పరామర్శించి దాడి జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినట్లు సీసీ ఫుటేజీలో పక్కా ఆధారాలు ఉన్నా వాటిని పరిశీలించి సుమోటాగా కేసు నమోదు చేయాల్సింది పోయి ప్రభాకర్‌రెడ్డిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందన్నారు. పోలీసులు వన్‌సైడ్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. అన్నీ గుర్తు పెట్టుకుంటామని అధికారంలోకి వచ్చిన తరువాత తప్పు చేసిన వారిని ఉపేక్షించమన్నారు. 

Updated Date - 2020-12-28T05:05:58+05:30 IST