పన్నుల భారం దారుణం : టీడీపీ
ABN , First Publish Date - 2020-12-12T04:41:27+05:30 IST
మున్సిపాలిటీ ప్రజలపై వైసీపీ ప్రభుత్వం ఆస్థిపన్ను భారం వేయడం దారుణమ ని బద్వేలు నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్ ఓబుళాపురం రాజశేఖ ర్ ఆవేదన వ్యక్తం చేశారు.
బద్వేలు, డిసెంబరు11: మున్సిపాలిటీ ప్రజలపై వైసీపీ ప్రభుత్వం ఆస్థిపన్ను భారం వేయడం దారుణమ ని బద్వేలు నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్ ఓబుళాపురం రాజశేఖ ర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఇప్పటి వరకు పట్టణాల్లో అద్దె విలువ ఆధారంగా పన్నులు వేసేవారని ఇప్పటి నుంచి ఆస్థి విలువ ఆధారంగా పన్నులు వేయబోతున్నారన్నారు. ఆస్థి విలువ, ఇంటి నిర్మాణం ఆధారంగా పన్ను వేయడం దారుణమన్నారు.
ఈ విధానంతో పన్ను 10నుంచి 22 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఏటా భూమి రిజిస్ర్టేషన విలువ, నిర్మాణం విలువ పెరుగుతుందన్నా రు. దానికి అనుగుణంగా పన్ను20రెట్లు పెరగబోతున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పన్ను విపరీతంగా పెంచే యోచన లో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు ఆక్రమణ పేరుతో పన్ను లెక్కించి రెట్టింపు పెనాల్టీ వేయబోతున్నారన్నారు. ఖాళీ స్థలానికి పన్ను కట్టాల్సి వస్తుందని ప్రజలకు భారంగా ఉన్న పన్నులు పెంచే ఆలోచన విరమించుకోవాలన్నారు. టీడీ పీ నేతలు ఎల్లారెడ్డి, పుల్లారెడ్డి,చంద్రశేఖర్‌రెడ్డి, దా నం, వెంకటరెడ్డి, రామ్మోహనరెడ్డి పాల్గొన్నారు.