దళిత, మైనార్టీలపై పేట్రేగుతోన్న దాడులు
ABN , First Publish Date - 2020-11-13T05:30:00+05:30 IST
రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిత్యం రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో దళితులు, మైనార్టీలపై అరాచకాలు, దాడులు పేట్రేగిపోతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, హరిప్రసాద్, కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అమీర్‌బాబు ఆరోపించారు.
టీడీపీ నేతలు
కడప(మారుతీనగర్), నవంబరు 13: రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిత్యం రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో దళితులు, మైనార్టీలపై అరాచకాలు, దాడులు పేట్రేగిపోతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, హరిప్రసాద్, కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అమీర్‌బాబు ఆరోపించారు. ఈ విషయంగా సలాం కుటుంబ సభ్యుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం అమీన్‌పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మాట్లాడారు. బాధితులను బెదిరించి, నిందితులను కాపాడేందుకు జగన్ ప్రభుత్వం పావులు కదుపుతున్న తీరు దారుణమని తెలిపారు. మోసపూరిత వాగ్ధానాలతో దళిత, బీసీ, మైనార్టీ, మహిళల ఓట్లతో జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి, ఇవాళ అరాచక పాలనకు తెరలేపారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా సీఎం మానవత్వంతో దళిత, బీసీ, మైనార్టీలకు బేషరతుగా క్షమాపణ చెప్పి, సలాం కుటుంబానికి త్వరితగతిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అణగారిన వర్గాలే తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్వర్‌హుస్సేన్, జిలానీబాష, శివకొండారెడ్డి, ఆమూరి బాలదాసు, రాంప్రసాద్, కోదండరాం, సుధాకర్, అనిల్, ఫిరోజ్, తదితరులు పాల్గొన్నారు.