‘కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించండి’
ABN , First Publish Date - 2020-12-04T04:34:14+05:30 IST
రంగసముద్రం పంచాయతీ పరిధిలోని మహబూబ్నగర్ కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ కడప పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు శ్వేతారెడ్డి డిమాండ్ చేశారు.

పోరుమామిళ్ల, డిసెంబరు 3 : రంగసముద్రం పంచాయతీ పరిధిలోని మహబూబ్నగర్ కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ కడప పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు శ్వేతారెడ్డి డిమాండ్ చేశారు. ఆమె గురువారం కాలనీలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆమెతో మాట్లాడుతూ 1011/1 సర్వే నెంబరులో 3 ఎకరాల 52 సెంట్లలో తాము గృహాలు నిర్మించుకున్నామని, ఇంటి పన్ను, కరెంటు బిల్లులు ఉన్నాయని, తమ వద్ద రసీదులు ఉన్నాయన్నారు. ఇటీవల రెవెన్యూ అధికారులు వైసీపీ నేతలకు తలొగ్గి తమను బయటికి వెళ్లనీయకుండా పోరుమామిళ్ల-బ ద్వేలు రోడ్డులో కంచె వేశారని తెలిపారు. రహదారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, దేవాలయానికి 20 సెంట్లు స్థలం కేటాయించాలని విన్నవించుకున్నా అధికారులు స్పందించలేదని తమ సమస్యలను ఆమెకు విన్నవించారు. దీంతో స్పందించిన ఆమె జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.