-
-
Home » Andhra Pradesh » Kadapa » tdp leader nara lokesh
-
నేడు ప్రొద్దుటూరుకు లోకేష్
ABN , First Publish Date - 2020-12-30T13:47:44+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ప్రొద్దుటూరుకు రానున్నారు.

కడప: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు ప్రొద్దుటూరుకు రానున్నారు. ఈ సందర్భంగా నిన్న దారుణ హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య అంత్యక్రియలకు హాజరుకానున్నారు. హత్యా రాజకీయాలను ఖండించి సుబ్బయ్య లోకేష్ కుటుంబాన్ని ఓదార్చనున్నారు.
ప్రొద్దుటూరులో పట్టపగలు ఇళ్ళపట్టాల పంపిణి కార్యక్రమం వద్ద అందరు చూస్తుండగా దుండగులు సుబ్బయ్యను నరికి చంపారు. హతుడు సుబ్బయ్య, అధికారపాలర్టీ శ్రేణులు ఇటీవల అసాంఘిక కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా వరుసగా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నారు. పేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చే ఫ్లాట్లలోనే సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.