టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పంతగాని

ABN , First Publish Date - 2020-12-06T05:18:06+05:30 IST

టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రైల్వేకోడూరు టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్‌ నియమితులయ్యారు.

టీడీపీ సాంస్కృతిక విభాగం   రాష్ట్ర అధ్యక్షుడిగా పంతగాని
పంతగాని నరసింహప్రసాద్‌

రైల్వేకోడూరు, డిసెంబరు 5: టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రైల్వేకోడూరు టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శనివారం ప్రకటించారు. పంతగాని నరసింహప్రసాద్‌ స్వయాన మేనమామ అయిన దివంగత చిత్తూరు ఎంపీ, మాజీ మంత్రి శివప్రసాద్‌ రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ చేపట్టిన నిరసనల్లో భాగంగా ఢిల్లీ స్థాయిలో విభిన్న కోణాల్లో వేషాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. అనారోగ్య కారణంగా శివప్రసాద్‌ మృతి చెందడంతో పార్టీకి తీరని లోటు అని అనుకునేలోపు శివప్రసాద్‌ చేసిన రీతిలోనే అల్లుడు పంతగాని నరసింహప్రసాద్‌ అదే కోవలో టీడీపీ కార్యక్రమాలు చేస్తూ అధినేత చంద్రబాబునాయుడు దృష్టిలో పడ్డారు. దీంతో ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు పంతగానికి మంచి కూడా కితాబు ఇచ్చారు. దీంతో టీడీపీ అధిష్ఠానం నరసింహప్రసాద్‌ను రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా నియమించిదిఇ. ఈ నియామకంతో నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-06T05:18:06+05:30 IST