టీడీపీ ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-11-22T05:16:03+05:30 IST

టిడ్కో ఇళ్ల విషయంలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆందోళన ఫలితంగానే రాష్ట్రప్రభుత్వం ది గొచ్చి లబ్ధిదారులకు స్వాధీనం చేసేందుకు సిద్ధమైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు.

టీడీపీ ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, నవంబరు 21 : టిడ్కో ఇళ్ల విషయంలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆందోళన ఫలితంగానే రాష్ట్రప్రభుత్వం ది గొచ్చి లబ్ధిదారులకు స్వాధీనం చేసేందుకు సిద్ధమైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. శనివారం  ఆయన విలేకరులతో మాట్లాడు తూ టీడీపీ హయాంలో ఫారెన్‌ టెక్నాలజీతో టిడ్కో గృహ సముదాయాల నిర్మాణం చేపట్టిందని, ఇందులో 6లక్షల గృహాలు పూ ర్తయినా, డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు అప్పగించక జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవమరించదన్నారు. దీనిపై టీడీపీ అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన చేయడంతో ఆ ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. సెంటు స్థలం ఇచ్చే విషయంగా భూముల కొనుగోలులో రూ.కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు.  సమావేశంలో టీడీపీ నాయకులు సీతారామిరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-22T05:16:03+05:30 IST