పన్నుల పెంపును ఉపసంహరించండి

ABN , First Publish Date - 2020-12-02T04:50:38+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇంటి విలువను లెక్కగట్టి పన్నులు విధించడం వలన ప్రజలపై అధిక భారం పడుతుందని ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసం హరించుకోవాలని సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

పన్నుల పెంపును ఉపసంహరించండి

\ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 1: రాష్ట్ర ప్రభుత్వం ఇంటి విలువను లెక్కగట్టి పన్నులు విధించడం వలన ప్రజలపై అధిక భారం పడుతుందని ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసం హరించుకోవాలని సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటి స్థలం ఆధారంగా  పన్నులు వసూలు చేస్తే పది రెట్ల పన్నుల భారం పెరుగుతుందన్నారు.  ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బుధ వారం తమ పార్టీ ఆధ్వర్యంలో  మున్సిపల్‌ కార్యాలయాల వద్ద నిరసన చేపడుతామని తెలిపారు.  కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు పక్కీరయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:50:38+05:30 IST