పన్నులు పెంచి ప్రజలను దగా చేయడమే

ABN , First Publish Date - 2020-12-12T05:10:16+05:30 IST

సంక్షేమ ఫలాలంటూ ఒక చేత్తో ఇవ్వడం, పన్నుల పెంపుతో ప్రజల సొమ్మును రెండు చేతులతో లాక్కోని దగా చేయడం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నైజమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

పన్నులు పెంచి ప్రజలను దగా చేయడమే
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 11 : సంక్షేమ ఫలాలంటూ ఒక చేత్తో ఇవ్వడం, పన్నుల పెంపుతో ప్రజల సొమ్మును రెండు చేతులతో లాక్కోని దగా చేయడం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నైజమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.  పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డితో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరో నా కష్టకాలంలో ప్రజలు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతుంటే, గోరుచుట్టుపై రోకటిపోటులా ఇంటి పన్నులను పెంపు దిశగా ఇంటి విలువ అధారంగా పన్ను విధింపుకు జగన్‌ సర్కార్‌ సిద్ధమైందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కష్టాలను దృష్టిలో పెట్టుకుని అ రాష్ట్రంలో ఇంటి పన్నుల చెల్లింపులో 50 శాతం రిబేటు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశా రు. ఇంటి పన్నుల విషయంగా పాతపన్నుల విధానం స్థానంలో కొత్తపన్నుల విధానం అమలు చేయాలని చూస్తే, టీడీపీ రాష్ట్రకమిటీ పిలుపు మేరకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. పట్టణంలో డివైడర్ల నిర్మాణాల పనులు అశాస్త్రీయంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ కార్యాలయాన్ని ఎమ్మెల్యే తన సొంత కార్యాలయంగా మార్చివేశారని వారు విమర్శించారు. అభివృద్ధి పేరిట చేస్తున్న పనుల్లో నాణ్యత లోపిస్తే, ఉన్నతాధికారులకు, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తాన్నారు. ఏది ఎమైనా కొత్త పన్నుల విధానంపై టీడీపీ ఉద్యమిస్తుందని  వారు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-12T05:10:16+05:30 IST