రెడ్‌జోన్లలో పటిష్ట చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2020-04-15T09:52:19+05:30 IST

రెడ్‌జోన్లలో పటిష్ట చర్యలు తీసుకుని కరోనా నివారణకు శక్తివంచన లేకుండా కృషిచేయాలని

రెడ్‌జోన్లలో పటిష్ట చర్యలు తీసుకోండి

పులివెందుల/సింహాద్రిపురం/వేంపల్లె , ఏప్రిల్‌ 14: రెడ్‌జోన్లలో పటిష్ట చర్యలు తీసుకుని కరోనా నివారణకు శక్తివంచన లేకుండా కృషిచేయాలని ఎస్పీ అన్బురాజన్‌ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పులివెందులలో పర్యటించిన ఎస్పీ అన్బురాజన్‌ పోలీసులతో చర్చించారు. డీఎస్పీ వాసుదేవన్‌కు సూచనలు అందించారు. రెడ్‌జోన్లలో ఎవరినీ బయటకు రాకుండా చూడాలన్నారు. వీధుల్లోనూ పోలీసులు భద్రత పెంచారు. న్యాక్‌ బిల్డింగ్‌ క్వారంటైన్‌లోని సిబ్బందికి, బాధితులకు మాస్కులు పంపిణీ చేశారు. మార్కెట్‌యార్డు చైర్మన్‌ చిన్నప్ప, స్నేహిత అమృత హస్తం సేవా సమితి సూచించారు.


వేంపల్లెలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్బురాజన్‌ హెచ్చరించారు. మే 3వ తే దీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్నారు. వేంపల్లె ఎంపీటీసీ సభ్యులు జయలక్ష్మిదేవి, రాజ్‌కుమార్‌ ఆధ్వ ర్యంలో గరుగువీధి పేదలకు కోడిగుడ్లు, కూరగాయలు పంపిణీ చేశారు. వేంపల్లె ఎస్‌ఐ సుభాష్‌చంద్రబోస్‌ సొంత ఖర్చుతో సిబ్బందికి, ట్రిపుల్‌ఐటీ సెక్యూరిటీ సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2020-04-15T09:52:19+05:30 IST