-
-
Home » Andhra Pradesh » Kadapa » take every precautions for covid
-
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి : ఆర్‌జేడీ
ABN , First Publish Date - 2020-12-20T04:59:12+05:30 IST
ప్రతి పాఠశాలలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పా ఠశాల విద్య ప్రాంతీ య సంచాలకులు ఎంవీ క్రిష్ణారెడ్డి తెలిపా రు.

కడప (ఎడ్యుకేషన్), డిసెంబరు 19 : ప్రతి పాఠశాలలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పా ఠశాల విద్య ప్రాంతీ య సంచాలకులు ఎంవీ క్రిష్ణారెడ్డి తెలిపా రు. కడప నగరంలో శనివారం పలు పాఠశాలలను డీఈవో శైలజతో పాటు ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు శానిటైజర్ చేసుకునేలా చూడాలని, అలాగే భౌతికదూరం పాటించాలన్నారు. మాస్కులు ధరించే విధంగా చూడాలన్నారు. మధ్యాహ ్న భోజనాన్ని పరిశీలించారు. గుడ్డు, చిక్కీ వెయిట్‌ను చూశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తిని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కడప ఎంఈవో నారాయణ, పాఠశాల ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎం ఆయుబ్, ఉపాధ్యాయులు ఇలయా్‌సబాషా, సీఆర్పీ శంకర్ పాల్గొన్నారు.