ఉపాధి అవకాశాల మెరుగుకు పాఠ్యాంశాల్లో మార్పులు
ABN , First Publish Date - 2020-12-20T05:16:10+05:30 IST
ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకే పాఠ్యాంశాలు, ప్రయోగశాలల్లో మార్పులు చేసినట్లు పులివెందుల జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపాల్ జీఎస్ ఎస్ రాజు పేర్కొన్నారు.

పులివెందుల రూరల్, డిసెంబరు 19: ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకే పాఠ్యాంశాలు, ప్రయోగశాలల్లో మార్పులు చేసినట్లు పులివెందుల జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపాల్ జీఎస్ ఎస్ రాజు పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని జేఎన్టీయూ కళాశాలలో బోర్డ్ ఆఫ్ స్టడీస్‌పై ఆన్‌లైన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి సాంకేతిక విద్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఉన్నత ప్రమాణాల కమిటీని నియమించారన్నారు. ఈ కమిటీ ఏపీలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలను మెరుగు పరచాలని సూచించారన్నారు. సమావేశం ద్వారా వివిధ ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌సీ, కేంద్రీయ విశ్వవిద్యాయాల నుంచి నిష్ణాతులైన ప్రొఫెసర్లు పాల్గొని పాఠ్యాంశాల్లో మార్పులు చేశారన్నారు. నూతన పాఠ్యాంశాలు 2020-21 విద్యాసం వత్సరం నుంచి అమలులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి, వివిధ విభాగాధి పతులు పాల్గొన్నారు.