యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-11T04:59:48+05:30 IST

కేశాపురం గ్రామం ముల్లవారికోట వాసి లక్కిశెట్టి లోకేశ (22) ఉరివే సుకుని మృతి చెందాడు.

యువకుడి ఆత్మహత్య
లోకేశ మృతదేహం

చిన్నమండెం, డిసెంబరు10: కేశాపురం గ్రామం ముల్లవారికోట వాసి లక్కిశెట్టి లోకేశ (22) ఉరివే సుకుని మృతి చెందాడు. గ్రోమోర్‌ సెంటర్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న లోకేశ రోజు మాదిరి గురువారం ఉదయం గ్రోమోర్‌ సెంటర్‌ను తెరిచా డు. సుమారు 10 గంటలకు ఆఫీసులోని ఒక గది లో సీలింగ్‌కొక్కికి చీరతో ఉరివేసుకుని చనిపోయాడని ఆఫీస్‌ సహోద్యోగి లోకేశ తల్లి వరలక్ష్మికి చెప్పా డు. విషయం తెలుసుకున్న చిన్నమండెం ఎస్‌ఐ హేమాద్రి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారుల ఒత్తిడితోనే కొడుకు చనిపోయి ఉండవచ్చునని మృతుడి తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

 రైలు కింద పడి యువకుడి మృతి

పుల్లంపేట, డిసెంబరు10: రెడ్డిపల్లె పేట వాసి ముత్యాల మహేష్‌(18) ప్రమాదవశా త్తు రైలు కింద పడి మృతి చెందాడు. గురువారం ఉదయాన్నే ఇంటి నుంచి వాకింగ్‌ చేస్తూ రైలు పట్టాలుదాటుతుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పొగమంచు అధికంగా ఉండడంతో రైలు రాకను గమనించక పోవడంతోనే యువకు డు ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపే ట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు రైల్వేపోలీసులు తెలిపారు.

Updated Date - 2020-12-11T04:59:48+05:30 IST