-
-
Home » Andhra Pradesh » Kadapa » suicide
-
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-26T05:15:39+05:30 IST
జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు గ్రామంలో మంగళవారం రాత్రి బాపనపల్లె రమణయ్య (47) అనే రైతు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

జమ్మలమడుగు రూరల్, నవంబరు 25: జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు గ్రామంలో మంగళవారం రాత్రి బాపనపల్లె రమణయ్య (47) అనే రైతు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల మేరకు.. ఈయన గ్రా మంలో 3.50 ఎకరాల తన సొంత పొలంతో పాటు మరికొంత కౌ లుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. అప్పులు ఎక్కువగా ఉండటం వల్ల వాటిని తీర్చడం భారమై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని జమ్మలమడుగు అర్బన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.