ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-22T04:42:06+05:30 IST

మండలంలోని బాగంపల్లె పంచాయతీలోని కుంటలముందర-నల్లప్పగారిపల్లెకు చెందిన వీ. నాగేశ్వర (35) కరెంటు స్తంభానికి ఉరివేసుకొని చనిపోయినట్లు ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపారు.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
విద్యుత్‌ స్తంభానికి ఉరివేసుకున్న నాగేశ్వర

సుండుపల్లె, నవంబరు21: మండలంలోని బాగంపల్లె పంచాయతీలోని కుంటలముందర-నల్లప్పగారిపల్లెకు చెందిన వీ. నాగేశ్వర (35) కరెంటు స్తంభానికి ఉరివేసుకొని చనిపోయినట్లు ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపారు. ఆయన వివరాల మేరకు.... నల్లప్పగారిపల్లెకు చెందిన నాగేశ్వర మతిస్థిమితం సరిగ్గా లేక మద్యానికి బానిసై బేల్దారి పని చేసుకుంటూ ఎక్కపడితే అక్కడ ఉంటూ జీవిస్తుండేవాడని తెలిపారు. నాలుగు రోజుల నుంచి తన తల్లితో పాటు నల్లప్పగారిపల్లెలో ఉన్నట్లు వివరించారు. కాగా శనివారం ఉదయం  గ్రామ సమీపంలోని  ఓ రైతు పొలం పక్కన కరెంటు స్తంభానికి ఉరి వేసుకొని చనిపోయినట్లు వివరించారు. అతనికి మతిస్థిమితం, ఆరోగ్యం సరిగా లేనందువల్లే ఆత్మహత్య చేసు కున్నట్లు  మృతుడి తండ్రి వెంకటసుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు తెలిపారు.

Read more