-
-
Home » Andhra Pradesh » Kadapa » Subsidized loans should be implemented as is
-
సబ్సిడీ రుణాలు యదాతధంగా అమలు చేయాలి
ABN , First Publish Date - 2020-12-28T05:24:53+05:30 IST
బీసీ నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు యదాతధంగా అమలు చేయాలని రాష్ట్ర కన్వీనర్ మాసా కోదండరామ్ పేర్కొన్నారు.

కడప (మారుతీనగర్), డిసెంబరు 27 : బీసీ నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు యదాతధంగా అమలు చేయాలని రాష్ట్ర కన్వీనర్ మాసా కోదండరామ్ పేర్కొన్నారు. నగరంలోని పాత రిమ్స్ ఎదురుగా ఉన్న జాతీయ బీసీ మహాసభ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో బీసీ ఫెడరేషన్లు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమశాఖ ద్వారా రుణాలు ఇస్తూ ఉండేవన్నారు. కొత్త ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలకు ప్రత్యేక నిధులు సమకూర్చుకుని వాటిని ప్రజలకు ఇవ్వాలని, అలా కాకుండా ఆ నిధులన్నీ ప్రభుత్వ నవరత్నాలకు మళ్లించడం దారుణమన్నారు. మునుపటి తరహాలోనే పథకాలు అమలు చేయాల ని, బీసీ సంక్షేమశాఖ ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలని డిమాండ్ చేశా రు. సమావేశంలో జిల్లా కన్వీనరు, కోకన్వీనర్లు రమణయ్య, నూకల పెంచలయ్య, రాష్ట్ర ప్రచార కన్వీనరు నరసింహులు, రాయలసీమ కన్వీనర్ షిండే భాస్కర్, జిల్లా యువజన కన్వీనర్ అవ్వారు రామ్మోహన్ పాల్గొన్నారు.