సుబ్బయ్యది వైసీపీ ప్రభుత్వ హత్యే ..

ABN , First Publish Date - 2020-12-30T05:23:05+05:30 IST

వైసీపీ అరాచకాలు, ఆగడాలు పరాకాష్టకు చేరుకున్నాయని, పార్టీ జిల్లా అఽధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ హత్యనే అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

సుబ్బయ్యది వైసీపీ ప్రభుత్వ హత్యే ..

- టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

కడప, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అరాచకాలు, ఆగడాలు పరాకాష్టకు చేరుకున్నాయని, పార్టీ జిల్లా అఽధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ హత్యనే అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సుబ్బయ్య బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అని, చాలా ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నారని తెలిపారు. దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నందం సుబ్బయ్య కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని తెలిపారు. 


ఆరోపణలు చేస్తే చంపేస్తారా ? : పుట్టా 

అక్రమాలు, అన్యాయాలు ఎత్తి చూపితే చంపేస్తారా అని టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలు ఎత్తిచూపారని బీసీ నాయకుడు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటసుబ్బయ్యను పట్టపగలే హత్య చేయడం దారుణమన్నారు. దీనిపై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 


అవినీతిని ప్రశ్నిస్తే హత్య చేస్తారా ?

ప్రొద్దుటూరు పట్టణంలో అధికార పార్టీ నాయకులు అధికారులతో కలిసి చేస్తున్న అరాచకాలను సోషియల్‌ మీడియా, పత్రికల ద్వారా బహిర్గతం చేసినందుకే టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను హత్య చేశారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి హరిప్రసాద్‌, బీసీ నాయకులు రాంప్రసాద్‌ సంయుక్త ప్రకటనలో ఆరోపించారు. చేసిన తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి హత్య చేస్తారా అంటూ ప్రశ్నించారు. 


టీడీపీ నేతలపై దాడులు దారుణం

చెన్నూరు, డిసెంబరు 29: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని టీడీపీ మైనార్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్‌, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యవర్గ సభ్యుడు చిన్నయ్యలు పేర్కొన్నారు. చెన్నూరులో మంగళవారం వారు మాట్లాడుతూ జగన్‌ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 


ప్రభుత్వమే బాధ్యత వహించాలి

కమలాపురం, డిసెంబరు 29: నందం సుబ్బయ్య హత్యకు ప్రభు త్వమే పూర్తి బాధ్యత వహించాలని, ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యనేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ ఆరోపించారు. కమలాపురంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.  హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. 

Updated Date - 2020-12-30T05:23:05+05:30 IST