ఉపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-05-30T11:27:42+05:30 IST

కవులు, రచయితలు, న్యాయ వాదు లు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, మేధావులైన ప్రజాస్వామిక వాదులపై ఉపా (అన్‌లాఫుల్‌ యాక్టివిటీ ప్రివెంటివ్‌ యాక్ట్‌) చట్ట వ్యతిరేక

ఉపా చట్టాన్ని  వెంటనే రద్దు చేయాలి

ప్రొద్దుటూరు అర్బన్‌ మే, 29: కవులు, రచయితలు, న్యాయ వాదు లు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, మేధావులైన ప్రజాస్వామిక వాదులపై ఉపా (అన్‌లాఫుల్‌ యాక్టివిటీ ప్రివెంటివ్‌ యాక్ట్‌) చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టంచట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అక్రమంగా జైళ్ల లో నిర్భం దించిన వారిని విడుదల చేయాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేశాయి. శుక్రవారం స్థానిక తహసీల్దారు కార్యాల యం వద్ద మే ధావుల నిర్భందానికి వ్యతిరేకంగ నినాదాలు చేస్తూ వారి విడుదలకై ధర్నా చేశారు. ఈ సందర్బంగా విరసం కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి మాట్లాడుతూ 80  ఏళ్ల వయస్సున్న వరవ రరా వును ప్రభుత్వం  18 నెలలుగా  బెయిలు ఇవ్వకుండా అడు ్డకుంటుం డటం దారుణమన్నారు. వరవరరావు ఉన్న  జైల్లోనే ఓ వ్యక్తి కరోనా తో మృతి చెందారని ఆయనను బలిచేయాలని కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు.


కరోనా పరిస్థితులలో రిమాండులో ఉన్న వారిని బెయిలుపై విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఆ మేరకు వారందరిని విడుదల చేయాలని కోరారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారు మనోహర్‌ రెడ్డికి వినతి పత్రం అందేశారు. కార్యక్రమంలో మానవ హక్కులవేదిక కన్వీనర్‌ జయశ్రీ, సీపీఐ నేత లు రామయ్య, సుబ్బరాయుడు, దళిత సమాఖ్య ఎల్లయ్య, ప్రగతిశీల కార్యిక సంఘం నాగేంద్ర, మిత్ర జ్యోతి మహమూద్‌, రాయలసీమ విద్యావంతుల వేదిక హమీద్‌, కొండ్రాయుడు పాల్గొన్నారు.    

Updated Date - 2020-05-30T11:27:42+05:30 IST