-
-
Home » Andhra Pradesh » Kadapa » Strike
-
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-11-22T05:17:41+05:30 IST
ఈనెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏపీ గ్రామ సేవ కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధైర్యం పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు టౌన్, నవంబరు 21: ఈనెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏపీ గ్రామ సేవ కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధైర్యం పేర్కొన్నారు. స్థాని క సీఐటీయూ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా గ్రామ సేవకులకు రూ.15 వేలు వేతనం పెంచుతామని హామీ ఇచ్చి ఇంతవరకు వేతనం పెంపుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కా ర్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల వైఖరికి నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో గ్రామ సేవకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శి సత్యనారాయణ, గ్రామ సేవకుల సంఘం పట్టణ కార్యదర్శి రాజు, అధ్యక్షుడు దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.