-
-
Home » Andhra Pradesh » Kadapa » Statehood is the goal of the struggle
-
రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం
ABN , First Publish Date - 2020-12-28T05:23:21+05:30 IST
పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం కొనసాగుతుందని మహాజన రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు యామనూరు చంద్రశేఖర్ తెలిపారు.

మహాజన రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రశేఖర్
కమలాపురం (రూరల్), డిసెంబరు 27 : పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం కొనసాగుతుందని మహాజన రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు యామనూరు చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం కమలాపురంలో మహాజన రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో నేటికీ బడుగు, బలహీన పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు అధికారానికి దూరంగా ఉన్నారని, ఈ అఽధికారం వారి చేతుల్లోకి వచ్చినప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. మన ఓటు మనకే అన్న సిద్దాంతంతో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సభలను నిర్వహించి అందరినీ చైతన్యపరుస్తూ బలోపేతం చేస్తామన్నారు. మహాజన రాష్ట్ర సమితి లీగల్ అడ్వయిజర్‌గా రవీంద్రప్రసాద్‌ను నియమించుకున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి అమీన్‌బాషా, రాష్ట్ర నాయకులు అబ్రహం, సుబ్బారావు, రామయ్య, రమణ, వీరయ్య, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.