ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చించండి

ABN , First Publish Date - 2020-12-02T04:47:09+05:30 IST

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చ జరగాలని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ప్రసాద్‌, పట్టణ కార్యదర్శి మహమ్మద్‌రఫి డిమాండ్‌ చేశారు.

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చించండి

జమ్మలమడుగు, డిసెంబరు 1: ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చ జరగాలని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ప్రసాద్‌, పట్టణ కార్యదర్శి మహమ్మద్‌రఫి డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను సాకుగా చూపి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా అనే మాటే లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా కోసం 9 మంది ఎంపీలు తమ పదవీ కాలం ఉన్నప్పటికి హోదాకోసం పదవులను త్యాగం చేస్తున్నా మని రాజీనామా చేశారని అధికారంలోకి వచ్చి సుమారు రెండు సంవత్సరాలు కావస్తున్నా హోదా మాటే మరచిపోయా రని వారు విమర్శించారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం ఎంపీలందరూ పదవులను త్యాగం చేసి రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-12-02T04:47:09+05:30 IST