బాలకార్మిక రహిత జిల్లాగా చేయాలి

ABN , First Publish Date - 2020-07-15T10:57:30+05:30 IST

జిల్లా వ్యాప్తంగా వీధి బాలలను, బాల కార్మికులను గుర్తించి బాల కార్మిక రహిత జిల్లాగా చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఎస్పీ ..

బాలకార్మిక రహిత జిల్లాగా చేయాలి

ఆపరేషన్‌ ముస్కాన్‌ అవగాహన ర్యాలీలో ఎస్పీ 


కడప (క్రైం), జూలై 14: జిల్లా వ్యాప్తంగా వీధి బాలలను, బాల కార్మికులను గుర్తించి బాల కార్మిక రహిత జిల్లాగా చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజ న్‌ పిలుపునిచ్చారు. ఆపరేషన్‌ ముష్కాన్‌ అవగాహన ర్యాలీ కార్యక్రమం కడప కోటిరెడ్డిసర్కిల్‌ వద్ద మంగళవారం నిర్వహించారు. ముందుగా ర్యాలీని జెండా ఊపి ఎస్పీ ప్రారంభించారు.


ఆయన మాట్లాడుతూ నేటి నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఎక్కడైనా వీధి బాలలు, అనాథ పిల్లలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వీధి పిల్లలు బయట అనవసరంగా తిరగడం వల్ల కరోనా సోకే అవకాశం ఉందని, అందుకోసమే ఆపరేషన్‌ ముష్కాన్‌ నిర్వహిస్తున్నామన్నారు. సీఎం జగన్‌, డీజీపీ గౌతంసవాంగ్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో 6వ విడతగా చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ పద్మజ, టీడబ్ల్యూసీ చైర్మన్‌ శివగామిని, సీఐలు సత్యబాబు, సత్యనారాయణ, నాగభూషణం, మహ్మద్‌ అలీ, అశోక్‌రెడ్డితో పాటు ఎస్‌ఐలు పాల్గొన్నారు.


ఆర్‌ఐలకు సన్మానం

జిల్లాలో సుదీర్ఘకాలం పాటు సేవలందించి బదిలీపై వెళుతున్న సాయుధ దళాధిపతులు (ఆర్‌ఐ)ల సేవలు అభినందనీయమని ఎస్పీ అన్బురాజన్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం బదిలీపై వెళుతున్న ఆర్‌ఐలు విజయకుమార్‌, శ్రీశైలరెడ్డి, చంద్రశేఖర్‌, టైటాస్‌, జావీదులను ఎస్పీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, ఆర్‌ఐ మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

Updated Date - 2020-07-15T10:57:30+05:30 IST