మనోధైర్యాన్ని మించిన మందు లేదు : ఎస్పీ

ABN , First Publish Date - 2020-07-15T10:56:52+05:30 IST

కరోనా వైరస్‌ బారిన పడి మనోధైర్యంతో కరోనాను జయించి తిరిగిరావడం ఎంతో సంతోషకరమని, మనోధైర్యాన్ని మిం చిన మందు లేదని ..

మనోధైర్యాన్ని మించిన మందు లేదు : ఎస్పీ

కడప (క్రైం), జూలై 14: కరోనా వైరస్‌ బారిన పడి మనోధైర్యంతో కరోనాను జయించి తిరిగిరావడం ఎంతో సంతోషకరమని, మనోధైర్యాన్ని మిం చిన మందు లేదని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ అన్నారు. ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడి కోవిడ్‌-19 ఆసుపత్రిలో చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన పోలీసు సిబ్బందికి  మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కోవిడ్‌-19 వైరస్‌ నియంత్రణలో భాగంగా విధులు నిర్వహించిన వారిలో 61 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. వీరిలో 22 మంది చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.


అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో పాటు మనిషికి మనిషికి ఆరడగుల భౌతిక దూరం పాటించాలని సూచించారు. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని, రోగ నిరోధకశక్తిని పెంపొందించుకునేందుకు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయాలని సూచించారు. చికిత్స పొందుతున్న 39 మంది సిబ్బంది త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరుతారన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ వంశీధర్‌, ఫ్యాక్షన్‌ జోన్‌ డీఎస్పీ చెంచుబాబు, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, ఆర్‌ఐ మహబూబ్‌బాషా, ఎస్బీ సీఐ రామచంద్ర పాల్గొన్నారు.


అధికారుల అండతో కోలుకున్నాం .. ఏఆర్‌ కానిస్టేబుళ్లు

గత నెల 25న కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించుకున్నాం. పాజిటివ్‌ రావడంతో మేము, మా కుటుంబ సభ్యులు మొదట చాలా భయపడ్డాం. క్వారంటైన్‌ వెళ్లి చికిత్స పొందాం. ఎస్పీ సహకారం మరువలేనిది. ప్రతిరోజూ పోలీసు అధికారులు ఫోను చేసి మా ఆరోగ్యంపై ఆరా తీయడంతో పాటు డ్రైఫ్రూట్స్‌, జ్యూస్‌లు అందించారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని విధుల్లో చేరడానికి మా అధికారుల సహకారం మరువలేనిది.

Updated Date - 2020-07-15T10:56:52+05:30 IST