ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2020-12-21T04:56:00+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల విషయంలో న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డిని ఉపాధ్యాయులు కోరారు.

రాయచోటిటౌన్, డిసెంబరు20: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల విషయంలో న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డిని ఉపాధ్యాయులు కోరారు. ఆదివారం చీఫ్ విప్‌ను నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయులు రాయచోటి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో కలిసి వెబ్ కౌన్సెలింగ్ లేకుండా మ్యానువల్‌గా నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయుల ఖాళీలను బ్లాక్ చేసిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు విన్నవించారు. ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించిన శ్రీకాంత్‌రెడ్డి ఫోన్ ద్వారా విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్లారు.