సోహెల్‌కు ఆర్ధిక సహాయం

ABN , First Publish Date - 2020-12-31T04:51:36+05:30 IST

ఇటీవల విద్యుత్‌ ప్రమాదం లో గాయపడిన సోహెల్‌కు చికిత్స నిమిత్తం మైదుకూరు పోలీసులు ఆర్థిక సహాయం అందించారు.

సోహెల్‌కు ఆర్ధిక సహాయం
సోహెల్‌ తండ్రికి నగదు అందిస్తున్న సీఐ

మైదుకూరు, డిసెంబరు 30: ఇటీవల విద్యుత్‌ ప్రమాదం లో గాయపడిన సోహెల్‌కు చికిత్స నిమిత్తం  మైదుకూరు పోలీసులు ఆర్థిక సహాయం అందించారు. 25న సోహెల్‌ స్నేహితులతో ఆడుతుండగా ట్రాన్స్‌ఫార్మర్ల మధ్య బంతి ప డడంతో దాని కోసం వెళ్లి  న బాలున్ని విద్యుత్‌ తీగలతో మంటలు లేచి శరీరానికి అంటుకున్నాయి.

దీంతో  గాయాలతో బయట పడిన బాలుడి చికిత్స కోసం అర్బన్‌ సీఐ మధుసూదనగౌడ్‌ 20 వేలు నగదు బాలుడు తండ్రి బషీర్‌కు అందచేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సుబ్బారావు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T04:51:36+05:30 IST