-
-
Home » Andhra Pradesh » Kadapa » Socializing with Lockdown
-
లాక్‌డౌన్‌తో సాంత్వన
ABN , First Publish Date - 2020-03-25T09:56:32+05:30 IST
ప్రపంచ వ్యాప్తంగా గడగడలా డిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడం లాక్‌డౌన్‌తోనే సాధ్యమౌతుంద ని అధికారులు

డిపోలకే పరిమితమైన బస్సులు
మూడు ఆటోలు సీజ్
ప్రజాసహకారం కోరిన ఎమ్మెల్యే
బద్వేలు/బద్వేలు,రూరల్/కలసపాడు/ కాశినాయన/పోరుమామిళ్ల/గోపవరం, మార్చి 24: ప్రపంచ వ్యాప్తంగా గడగడలా డిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడం లాక్‌డౌన్‌తోనే సాధ్యమౌతుంద ని అధికారులు వివరిస్తున్నారు. నియోజ కవర్గం లోని ఏడు మండలాల్లో అధికారులు, పోలీసులు ప్రత్యేకించి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌లోనూ యువత అనవసరంగా రోడ్లపైకి వస్తుండడంతో వారిని నిలిపి వెనక్కు పంపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కొరడా ఝు లిపిస్తున్నారు. అత్యవసర వాహనాలనే అనుమతి స్తున్నారు. నిత్యావసర సరుకులు దుకాణాలు మినహా అన్ని దుకాణాలు మూత పడ్డాయి. ఎవరైనా నిబంధనలను అధిగమిస్తే కఠిన చర్యలు తప్పవని బద్వేలు అర్బన్ సీఐ రమే్‌షబాబు హెచ్చరిస్తున్నారు.
వైరస్ నివారణకు తీసుకోవాల్సి న చర్యలపై కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తూ అధికారులు, వలంటీర్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల సహకారంతోనే కరో నా నియంత్రణ సాధ్యమైతుందని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య కోరారు. మంగళవారం ఎమ్మెల్యే ఫోన్‌ద్వారా ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ప్రజలం దరూ ఐక్యంగా కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు అనుగుణంగా ప్రజల నిత్యావసరాల కోసం పోలీసులు షరతులు విధించారు. అర్బన్ సీఐ రమే్‌షబాబు కూరగాయలు, నిత్యావసర దుకాణాలు ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకే తెరవాలన్నారు. కలసపాడు మండలంలో పారిశుధ్య కార్మికులు వీధులన్నీ శుభ్రపరిచారు. ఇందులో భాగంగా గ్రా మం మొత్తం బ్లీచింగ్ చల్లారు. మురికి పేరుకు న్న చోట మట్టిని చల్లారు. కలసపాడు మండల అధికారి జగన్‌మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో పను లు నిర్వహించారు.
కలసపాడులో కూరగాయల దుకాణాలు జనాలతో కిక్కిరిశాయి. ఉదయం 6గంటల నుంచే కూరగాయల కోసం ప్రజలు ఎగబడ్డారు. దీంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రజలు ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం ఆంక్షలు విధించినా ప్రజలు ఏ మాత్రం లెక్కచేయకుండా యధేచ్ఛగా తిరుగుతున్నారు. కాశినాయన మండలం ఇటుకులపాడులో కరోనా వైర్‌సపై ప్రజలకు అవగాహన కల్గించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
కర్ప్యూకు సహకరించాలంటున్న అధికారులు పండుగపేరుతో రోడ్లపైకి...
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ పేరుతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. కరోనావైరస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు, పోలీసులు చర్యలు తీసుకుం టున్నా ప్రజలు పట్టించుకోవడంలేదు. దీంతో పో లీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మంగళవారం కొందరు కూరగాయల అంగళ్లవద్ద గుంపులు గుంపులుగా గుమికూడారు. ఎస్‌ఐమోహన్ అంబేడ్కర్ సర్కిల్, మహాత్మాగాంధీ విగ్ర హం సర్కిల్, వైజంక్షన్ ప్రాంతాల్లో ఎక్కువగా వాహనాలు తిరగకుండా చర్యలను చేపట్టారు.
రెవెన్యూ విభాగం చర్యల్లో భాగంగా తహసీల్దార్ ఆయూబ్, ఆర్‌ఐ సిద్దేశ్వరయ్య, వీఆర్వో రామక్రిష్ణారెడ్డి బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గానుగపెంటలో వీఆర్వో రామక్రిష్ణారెడ్డి ఇంటింటికీ తిరిగి ఈ వ్యాధిపట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. పంచాయతీ అధికారులు బ్లీచింగ్ పౌడర్ చల్లించి, చెత్తా చెదారాలను దూర ప్రాంతాలకు తరలించారు.
గోపవరం మండలంలో కరోనా వ్యాప్తిని అరికడదామని అధికారులు వివరిస్తున్నారు. మంగళవారం కాలువపల్లె పంచాయతీలో తహసీల్దారు వెంకటరమణ, వైద్యాధికారి నర్మద, ఎస్‌ఐ లలిత అధికారులతో కలిసి ఆరు గ్రామాల్లో విస్రృతంగా పర్యటించారు. గల్ఫ్‌దేశాలనుంచి వచ్చిన 40 మం ది అధికారుల సూచనల మేరకు ఇంటిపట్టునే ఉంటూ సహకరించాలని సూచించారు. మొత్తమ్మీ ద గల్ఫ్‌దేశాల నుంచి వచ్చిన వారు ఏప్రిల్ 7వ తేదీ వరకు ఇంటికే పరిమితం కావాలని ఈ విషయంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఈఓపీఆర్‌డీ విజయ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసు ల రెడ్డి, కుప్పాల శ్రీరాములు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.