సామాజిక దూరం పాటించాలి

ABN , First Publish Date - 2020-03-27T09:42:48+05:30 IST

కరోనా వైరస్‌ ప్రబలకుండా ప్రజలు సామాజిక దూరం పా టించేలా కఠిన చర్యలు తీసుకుంటున్నామని మున్పిపల్‌ కమిషనర్‌ రాధ పేర్కొన్నారు. గురువారం ఆమె తన ఛాంబర్‌లో డీఎస్పీ సుధాకర్‌

సామాజిక దూరం పాటించాలి

ప్రొద్దుటూరు క్రైం, మార్చి 26 : కరోనా వైరస్‌ ప్రబలకుండా  ప్రజలు సామాజిక దూరం పా టించేలా కఠిన చర్యలు తీసుకుంటున్నామని మున్పిపల్‌ కమిషనర్‌ రాధ పేర్కొన్నారు.  గురువారం ఆమె తన ఛాంబర్‌లో డీఎస్పీ సుధాకర్‌ లోసారి, తహసీల్దార్‌ చెండ్రాయుడులతో కలిసి పట్టణంలోని మండి మర్చంట్స్‌, మాల్స్‌, సూపర్‌మార్కెట్లు, కిరాణాదుకాణదారులతో సమావేశమమై నిత్యావసరాల కొనుగోలు కోసం వచ్చే వారు ఒకరికి మరోకరి మధ్య  దూరం ఉండేలా మార్కింగ్‌ చేయడంతో పాటు థర్మ ల్‌ స్కానింగ్‌ చేసి, హ్యాండ్‌వాష్‌ చేసిన తర్వాతే దుకాణంలోకి అనుమతి ఇవ్వాలన్నారు.


మరీ ముఖ్యంగా డోర్‌ డెలివరికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు వ్యాపారాలు చేసుకోవచ్చని,  మున్పిపల్‌ హైస్కూల్‌ మైదానం, ఎగ్జిబిషన్‌ మైదానంతో కలిపి 140 షాపులు, ఎద్దుల సుబ్బమ్మ పాఠశాలలో 15 షాపులు, మైదుకూరురోడ్డు కశెట్టి స్కూల్‌లో 22 షాపులు, జిన్నారోడ్డులోని ఉర్దూ స్కూల్‌లో 8 షాపులు, గాంధీరోడ్డులోని మున్పిపల్‌ మార్కెట్‌లో మరో 8 షాపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  సీఐలు నరసింహారెడ్డి, నాగరాజు, వ్యాపారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-27T09:42:48+05:30 IST