పట్టాలకు స్థలాలు చూపించరా...

ABN , First Publish Date - 2020-12-29T05:12:58+05:30 IST

లక్కిరెడ్డిపల్లె మండలం గ్రామ పరిధిలోని 2017-18 సంవత్సరాలకు సంబంధించి నాటి ప్రభుత్వం ఇచ్చి న స్థల పత్రాలకు హ ద్దులు, స్థలం చూపించాలని సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.

పట్టాలకు స్థలాలు చూపించరా...

లక్కిరెడ్డిపల్లె, డిసెంబరు28: లక్కిరెడ్డిపల్లె మండలం గ్రామ పరిధిలోని 2017-18 సంవత్సరాలకు సంబంధించి నాటి ప్రభుత్వం ఇచ్చి న స్థల పత్రాలకు హ ద్దులు, స్థలం చూపించాలని సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాయచోటి నియోజకవర్గ సహాయ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ అప్పటి రెవెనూ యంత్రాంగం వీళ్లు అన్నిరకాలుగా అర్హులను గుర్తించి పేదలకు నివాస స్థలం పత్రాలు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ  అధికారులు హద్దులు చూపించలేదన్నారు. సీపీఐ మండల కార్యదర్శి ఓబులేసు, రమేష్‌, మహిళలు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-29T05:12:58+05:30 IST