శివాలయం పూజారి దారుణహత్య
ABN , First Publish Date - 2020-04-04T09:24:57+05:30 IST
నీలకంట్రావుపేట పంచాయతీ శివనందిపురం శివాలయం పూజారి (రాయచోటి ఎస్టీ హాస్టల్ వాచ్మెన్) శ్రీరాములునాయక్
రామాపురం, ఏప్రిల్ 3: నీలకంట్రావుపేట పంచాయతీ శివనందిపురం శివాలయం పూజారి (రాయచోటి ఎస్టీ హాస్టల్ వాచ్మెన్) శ్రీరాములునాయక్ శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారి పక్కన శివాలయం నిర్మించుకుని, పూజలు చేసుకుంటున్న శ్రీరాములునాయక్ కసిరెడ్డిగారిపల్లె ఎస్సీ, ఎస్టీ వసతి గృహాంలో వాచ్మెన్గా పనిచేసేవాడు. నాయక్ హత్యపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. లక్కిరెడ్డిపల్లె సీఐ యుగంధర్, ఎస్ఐ మైనుద్దీన్ పరిశీలించారు.