ఎర్రచందనం స్వాధీనం...ఏడుగురు స్మగ్లర్లు అరెస్టు

ABN , First Publish Date - 2020-09-14T10:47:59+05:30 IST

అక్రమంగా తరలుతున్న ఎర్రచందనంపై బాలపల్లె అటవీశాఖాధికారులు దాడులు నిర్వహించారు.

ఎర్రచందనం స్వాధీనం...ఏడుగురు స్మగ్లర్లు అరెస్టు

రైల్వేకోడూరు, సెప్టెంబరు, 13: అక్రమంగా తరలుతున్న ఎర్రచందనంపై బాలపల్లె అటవీశాఖాధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలపల్లె రేంజర్‌ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ దేశెట్టిపల్లె బీట్‌లోని కుప్పబోడు ప్రాంతంలో టాటాఏస్‌లో ఏడు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు వివరించారు.  రెండు ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేసి కడప, కర్నూలు జిల్లా వాసులు బిల్డన్‌ ఎల్లయ్య, బొల్లె రంగనాయకులు, రాసిపోగుల సూర్యమోహన్‌రాజు, రాశిపోగుల సతీ్‌షకుమార్‌, పత్తి కొండ చిన్నా, రంగస్వామిని అరెస్టు చేసినట్లు తెలిరు. అలాగే బాలపల్లె తనిఖీ కేంద్రం వద్ద పది ఎర్రచందనం దుంగలను పట్టుకుని వాహనాన్ని సీజ్‌ చేసి చిత్తూ రు జిల్లా అంజిమేడుకు చెందిన లారీ డ్రైవర్‌ వేణుగోపాల్‌ను అరెస్టు చేసినట్లు వివరించారు.

Updated Date - 2020-09-14T10:47:59+05:30 IST