సేంద్రియ ఎరువులతో తెగుళ్లు లేని పైర్లు

ABN , First Publish Date - 2020-11-22T04:47:09+05:30 IST

రైతులు సేంద్రియ ఎరువులు ఉపయోగించడంతో పైర్లు కళకళలాడుతున్నాయి. ప్రకృతి వ్యవసాయంపట్ల ఆసక్తి కనబరిచి పంటలను సాగు చేసిన వరి, పసుపు పైర్లకు ఎలాంటి తెగుళ్లు సోకలేదని రైతులు వివరించారు.

సేంద్రియ ఎరువులతో తెగుళ్లు లేని పైర్లు
సేంద్రియ ఎరువులతో సాగు చేసిన వరిపైరు

చాపాడు, నవంబరు 21: సీతారామపురం, చాపాడు గ్రా మాల్లో రైతులు సేంద్రియ ఎరువులు ఉపయోగించడంతో పైర్లు కళకళలాడుతున్నాయి. ప్రకృతి వ్యవసాయంపట్ల ఆసక్తి కనబరిచి పంటలను సాగు చేసిన వరి, పసుపు పైర్లకు ఎలాంటి తెగుళ్లు సోకలేదని రైతులు వివరించారు. కేంద్రం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అందిస్తున్న ప్రో త్సాహకాన్ని అందిపుచ్చుకునిసాగు చేసిన వరి కోత దశ, పసుపు దుంపలు ఊరే దశకు చేరుకుంది. ఈ పంటలకు ఘనామృతం, జీవామృతమైన ఆవుపేడ, మూత్రం, పుట్ట మట్టి, బెల్లం కలిపి చల్లుతున్నారు. ఫలితంగా సూక్ష్మపోష కాలు సమృద్ధిగా లభిస్తున్నాయని రైతులు తెలిపారు. మూ డేళ్ల నుంచి రైతులు ఈపంటలు సాగు చేస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ బ్లాక్‌ కోఆర్డినేటర్‌ మునిలక్ష్మి, మండల కార్యక ర్త రామాంజనేయులు తెలిపారు. ఈ పంటల సాగుకు రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలి పారు. పల్లవోలు, ఖాదర్‌పల్లె, నాగులపల్లెల్లోని రైతులు కూ డా కూరగాయల పెరటితోటలు వరి సుమారు 150 ఎకరా ల్లో సాగు చేశారు. ప్రకృతి వ్యవసాయంతో మొక్కల్లో వ్యాధి నిరోధకత పెరిగి తెగుళ్లు రాకుండా ఉంటాయని మునిలక్ష్మి పేర్కొన్నారు. ఎవరైనా సాగు చేయడానికి ముందుకు వస్తే వారికి కూడా సహకారం అందిస్తామన్నారు. 

మూడెకరాలు సాగు చేశాను

ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో రెండెకరా ల్లో వరి,  ఎకరాలో పసుపు సాగు చేశా ను. రెండు రకాల పైర్లకు తెగుళ్లు సోక కుండా పచ్చగా ఉన్నాయి. కేవలం రూ.1500 ఖర్చుతో సాగు చేశాను. వారం రోజుల్లో కోత కోస్తాను. ప్రకృతి వ్యవ సాయ అధికారుల సలహాలతో పైర్లు ఆశాజనకంగా ఉన్నాయి.

ఓబుళరెడ్డి, రైతు, సీతారామపురం గ్రామం



Updated Date - 2020-11-22T04:47:09+05:30 IST