ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు
ABN , First Publish Date - 2020-12-14T05:02:35+05:30 IST
రామేశ్వరంలోని సీఎస్‌ఐ చర్చిలో ఆదివారం రాత్రి ముందస్తు క్రిస్మస్ వేడుకలు, కొవ్వొత్తుల ఆరాధనను ఘనంగా నిర్వహించారు.

ప్రొద్దుటూరు టౌన్, డిసెంబరు 13: రామేశ్వరంలోని సీఎస్‌ఐ చర్చిలో ఆదివారం రాత్రి ముందస్తు క్రిస్మస్ వేడుకలు, కొవ్వొత్తుల ఆరాధనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాలకు చెందిన ఫాస్టర్ ఎంఎ్‌సటీ డాక్టర్ వేదన్‌బాబు మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవాళికోసం వారిని రక్షించడం కోసం మానవునిగా జన్మించారని పేర్కొన్నారు. భూమిపైకి యేసుప్రభువు వెలుగై వచ్చాడని ఆయన రాకకు నిదర్శనంగా కొవ్వొత్తులను వెలిగించారు. డివిజనల్ ఛైర్మన్ రెవరెండ్ చిత్రాల దానమయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పాటలు పాడారు. కార్యక్రమంలో శలోమ్‌రాజ్, సంఘం, సంఘపెద్దలు పాల్గొన్నారు.
