హోంగార్డు ఉద్యోగాల కోసం రెండో రోజు 161 దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-12-28T04:36:18+05:30 IST

హోంగార్డు ఉద్యోగాల కోసం రెండోరోజు 161 దరఖాస్తులు వచ్చినట్లు ఎస్పీ కేకేఎన అన్బురాజన తెలిపారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రతిభ, పారదర్శకంగానే ఉంటుందన్నారు.

హోంగార్డు ఉద్యోగాల కోసం రెండో రోజు 161 దరఖాస్తులు

కడప (క్రైం), డిసెంబరు 27: హోంగార్డు ఉద్యోగాల కోసం రెండోరోజు 161 దరఖాస్తులు వచ్చినట్లు ఎస్పీ కేకేఎన అన్బురాజన తెలిపారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రతిభ, పారదర్శకంగానే ఉంటుందన్నారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే డయల్‌ 100కు కానీ, లేదా పోలీసు వాట్సప్‌ నెంబరు 7075484707కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నా రు. దరఖాస్తులను 26వ తేదీ నుంచి 31 లోగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేయవచ్చన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి వెంకటేశ్వర్‌రావు, ఆర్‌ఐ సోమశేఖర్‌నాయక్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-12-28T04:36:18+05:30 IST