వర్గీకరణ చట్టబద్ధతకు సహకరించాలి

ABN , First Publish Date - 2020-11-16T05:09:39+05:30 IST

వర్గీకరణ చట్టబద్ధతకు సహకరించాలని ఏపీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్యమాదిగ ఆసంఘం నాయకులు ఎమ్మెల్యే సుధీర్‌రెడిని కోరారు.

వర్గీకరణ చట్టబద్ధతకు సహకరించాలి
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 15: వర్గీకరణ చట్టబద్ధతకు సహకరించాలని  ఏపీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్యమాదిగ ఆసంఘం నాయకులు ఎమ్మెల్యే సుధీర్‌రెడిని కోరారు. ఆమేరకు ఎమ్మెల్యేకు వారొక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీవర్గీకరణ సాధనకోసం మాదిగలు 27 సం వత్సరాలుగా  పోరాటం చేస్తున్నారన్నారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ చట్టబద్ధతకోసం ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేకు  విన్నవించా రు.  కార్యక్రమంలో ఏపీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు యల్లయ్యమాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు తప్పెట తిరుమలయ్య,  పాల్గొన్నారు.

Updated Date - 2020-11-16T05:09:39+05:30 IST