-
-
Home » Andhra Pradesh » Kadapa » Save for Government
-
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : పంతగాని
ABN , First Publish Date - 2020-11-27T06:41:09+05:30 IST
వరద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైల్వేకోడూరు టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు బొక్కసం సునీల్ డిమాండు చేశారు.

రైల్వేకోడూరు రూరల్, నవంబరు 26: వరద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైల్వేకోడూరు టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు బొక్కసం సునీల్ డిమాండు చేశారు. గురువారం రైల్వేకోడూరు పట్టణంలోని నదీపరివాహ ప్రాంతాలైన ధర్మాపురం, నరసరాంపురం తదితర ప్రాంతాలలో పర్యటించి వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద నీరు ముంపు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోయే విధంగా వచ్చాయని, గుడిసెలలో జీవనం సాగిస్తున్న పేదలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మావిళ్ల సుబ్బరాయుడు, కస్తూరి దినేష్ పాల్గొన్నారు.