-
-
Home » Andhra Pradesh » Kadapa » sasyarakshan
-
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
ABN , First Publish Date - 2020-12-16T04:52:57+05:30 IST
బొప్పాయి రైతులు సాగులో సస్యరక్షణ పాటించాలని అనంతరాజుపేట మహిళా శాస్త్రవేత్త తోట నాగలక్ష్మి తెలిపారు.

రైల్వేకోడూరు రూరల్, డిసెంబరు, 15: బొప్పాయి రైతులు సాగులో సస్యరక్షణ పాటించాలని అనంతరాజుపేట మహిళా శాస్త్రవేత్త తోట నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం వైఎస్ చాన్సలర్ టు విలేజ్ అనే కార్యక్రమాన్ని మండలంలోని వీపీఆర్ కండ్రిక గ్రామ పంచాయతీ లోని తాడివారిపల్లె గ్రామంలో బొప్పాయి పంటపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె బొప్పాయి సాగులో ప్రధానంగా వచ్చే తెగుళ్లు గురించి రైతులకు వివరించారు. అనంతరాజుపేట ఉద్యాన శాస్త్రవేత్త శ్రీధర్, శరత్‌కుమార్‌రెడ్డి వర్మీకంపోస్టు తయారీ విధానంపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు.