పారిశుధ్య పనులు వేగవంతం చేయండి : జేసీ

ABN , First Publish Date - 2020-12-02T05:05:46+05:30 IST

బుగ్గవంక పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని జేసీ (అభివృద్ధి) సాయికాంత్‌వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.

పారిశుధ్య పనులు వేగవంతం చేయండి : జేసీ
ప్రకాశ్‌నగర్‌లో పర్యటిస్తున్న జేసీ సాయికాంత్‌ వర్మ

కడప(ఎర్రముక్కపల్లె), డిసెంబరు 1: బుగ్గవంక పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని జేసీ (అభివృద్ధి) సాయికాంత్‌వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కడప నగరంలోని బాలాజీనగర్‌, ప్రకాశ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆయన మాట్లాడుతూ నివర్‌ తుఫాను ప్రభావంతో బుగ్గవంక ఇరువైపులా ఉన్న పలు కాలనీల ఇళ్లల్లోకి నీరు రావడంతో బురదమయమైందని, పగలే కాకుండా రాత్రి షిఫ్టులోనూ పనులు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. వెంటనే బ్లీచింగ్‌, సున్నం స్ర్పే చేసి అంటువ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజనీర్లు అబ్దుల్‌ రవూఫ్‌, రాధాక్రిష్ణవేణి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T05:05:46+05:30 IST